భీమదేవరపల్లి, వెలుగు: హనుమకొండ జిల్లా ముల్కనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విశ్వనాథ కాలనీకి చెందిన గుంజి ఐలయ్య అనే వ్యక్తి ఆటోలో పేలుడు పదార్థాలు తరలిస్తున్నాడన్న సమాచారంతో వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం దాడులు నిర్వహించారు. 8 బాక్సులు జిలెటిన్ స్టిక్స్ (మొత్తం 1,440 స్టిక్స్), 1,950 డిటోనేటర్లు, 8 కార్డెక్స్ వైర్ పెద్ద బండిళ్లు, 2 చిన్న బండిల్స్ ను, ఆటోను స్వాధీనం చేసుకున్నారు.
వీటి విలువ సుమారు రూ.7,07,500 ఉంటుందని అధికారులు తెలిపారు. మరోవ్యక్తి వల్లపు రాజయ్య పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దాడుల్లో లో ఏసీపీ ఏ. మధుసూదన్, ఇన్స్పెక్టర్ ఎస్. రాజు, ఆర్ఎస్ఐ ఓ. భాను ప్రకాశ్ మరియు వరంగల్ టాస్క్ ఫోర్స్ బృందం పాల్గొన్నారు.
